15, జనవరి 2009, గురువారం

కనుమ స్పెషల్ [నసీరుద్దీన్ కథ ]

టెమూజిన్ కి డేకిశా జింకమాంసం తినడమంటే ఇష్టం. అలాగే మరి నేనూ ఒక చిన్న టేమూజిన్ ని కదా అందుకని నాకు డేకిశా చికెన్ మాంసం తినడం అంటే ఇష్టం. అందుకే నాకు కనుమ పండుగ అంటే ఇష్టం. అందుకని మీ అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు.

ఈ రోజు కనుమ స్పెషల్ గా ఒక కధ చెపుతానండీ. ఈ కధ నాకు చాలా ఇష్టం. మీరు కూడా చదివి ఆనందిస్తారని ఆశిస్తూ.

ఒక సారి ఎవరో నసీరుద్దీన్ సాటిలేని విలుకాడు అంటుంటే, పాదూషా విన్నాడు. దాంతో ఆయనకి చాలా కుతూహలంగా అనిపించింది. సరే అని నసీరుద్దీన్ ని పిలిపించాడు. వాళ్ళు ఇద్దరూ నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలో ఒక చెట్టు కనిపించింది. వెంటనే పాదూషా నసీరుద్దీన్ ని ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టుని గురి చూసికొట్టమని కానీ 3 మాత్రమే అవకాశాలు అని చెప్పాడు. నసీరుద్దీన్ మొదటి బాణం పొరపాటున గురి తప్పింది. పాదూషా వెటకారంగా నవ్వాడు.

"నవ్వకండి, ప్రభూ! యిది తమరి నైపుణ్యం” అన్నాడు నసీరుద్దీన్. తరవాత రెండో బాణం కూడా గురితప్పింది. పాదూషా మళ్ళీ నవ్వాడు.

"నవ్వద్దు, ప్రభూ!యిది తమరి మంత్రుల నైపుణ్యం” అన్నాడు నసీరుద్దీన్. తరవాత మూడో బాణం మాత్రం సూటిగా వెళ్ళి కాండానికి గుచ్చుకుంది.
నసీరుద్దీన్ వంగి సలామ్ చేస్తూ “వినయంగా చెప్పాలంటే యిది నసీరుద్దీన్ నైపుణ్యం” అన్నాడు. పాదూషా గతుక్కుమన్నాడు. గతుక్కుమన్నది నసీరుద్దీన్ చివరి మాటకి కాదు. `ఇందాకటి దాకా నసీరుద్దీన్ తనని, తన మంత్రులని అన్నప్పుడు తను నసీరుద్దీన్ కొట్టలేడు అన్న ఉద్దేశంతో పట్టించుకోలేదు కానీ తన మీద నసీరుద్దీన్ విసిరిన చలోక్తులకి ఎవరైనా నవ్వుతారేమోనని.’

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నసిరుద్దీన్, భట్టి-విక్రమార్క కథలు బావుంటయి. వాటిని అందిస్తున్నందుకు ధన్యవాదాలు

రాధిక చెప్పారు...

:)బాగుంది