నేనేమన్నా చిన్నదాన్నా చితకదాన్నా! బొల్డుకుంచెం పెద్దదాన్ని. మరేమో నిఝెంగా చిన్నదాన్నే అనుకోండి కాని మరేమో నేను బుడుగు చదివాను, యండమూరి నవలలు, భారతం, భాగవతం, విశ్వదర్శనం, విశ్వరూపం చదివాను, మధుబాబు నవలలు, మార్క్ ట్వేన్ నవలలు, మరియు కొన్ని అంగ్ల నవలలు చదివాను. నేను నకిలీ బాపూలాగా [అంటే బాపు బొమ్మలను కాపీ చేస్తుంటాను అన్నమాట] బొమ్మలేసేస్తుంటాను ఇంకా చాలా చేస్తానులేండి. అందుకే నేను బొల్డుకొంచం పెద్దదాన్ని.