4, మార్చి 2009, బుధవారం

నా గీతల్లో వివేకానందుడు [బొమ్మ]వివేకానందుడి `ఫోటో’ చూసి నేను వేసిన ఈ బొమ్మ నా తొలి ప్రయత్నం. వివేకానందుడి జీవిత చరిత్ర చదివినప్పటి నుండి ఆయన బొమ్మ వేయాలని కలలు కనేదాన్ని కానీ, ధైర్యం మాత్రం చాలేది కాదు. తీరా నేను బొమ్మ వేశాక ఎవరైనా ఆ బొమ్మని చూసి "ఏంటి ఈ బొమ్మ? ఎవరి బొమ్మా నువ్వు వేసింది?" అని అడగాల్సి వస్తుందేమోనని పెద్ద అనుమానం. అప్పుడు నాకు నేను ‘అయ్యవారిని చెయ్యబోతె కోతి అయ్యింది’ అన్న సామెత చెప్పుకోవాల్సి వస్తుంది కదా!

కానీ ఇన్నాళ్ళకి నా కలలు సాకారం అయ్యాయి!

నేనూ మార్గదర్శిలో చేరాను. ఒక బొమ్మ వేశాను.