11, జనవరి 2009, ఆదివారం

చిలుక పరకాయప్రవేశం – 4

(నిన్నటి కధ తరువాయి బాగం)

రత్నవల్లి వంటమనిషి చేసిన చిలుక కూర తిన్నది.

కొన్ని రోజులు గడిచినై. విక్రమార్కుడు ఆ ఊరిలోని పరాకు స్వామి గుడి గోపురంమీద నివసించ సాగాడు. రత్నవల్లి చాలా రోజుల నుండి ఆ గుడికి వచ్చి దేవుడికి పూజలు చేసి, పోవడం విక్రమార్కుడు గమనించాడు. అసలు ఏం కోరిక కోరుకోడానికి రత్నవల్లి గుడికి వస్తుందా అని, ఒక రోజు రాత్రి విక్రమార్కుడు దేవుడి విగ్రహం వెనక కూర్చున్నాడు.

విక్రమార్కుడు రత్నవల్లి ఏమని దేవుడిని వరం కోరుతుందనుకున్నాడో మనకి తెలీదు కానీ ఆమె మాత్రం మామూలు కోరిక కోరుకోలేదు.

"దేవుడా! నాకు బొందితో వైకుంఠం (ఆకాశం నుండి ఒక పుష్పక విమానం వస్తుందంట, ఎంతో పుణ్యం చేస్కున్నవారి కోసం మాత్రమే ఆ విమానం వస్తుందంట. దానిలో ఎక్కితే సశరీరంగా వైకుంఠానికి చేరుకుంటారట. ఇది నిజమా కాదా అన్న విషయాన్ని పక్కన పెట్టి మనం కధలో ముందుకు పోదాం) వచ్చే భాగ్యం ఇవ్వండి స్వామి. ఎన్ని రోజుల నుండి మీ గుడికి వచ్చి పూజలు చేస్తున్నాను? నన్ను ఆ పాటి కరుణించరాదా స్వామీ!” అంటూ చాలా పెద్దపెద్ద కోరిక కోరింది.

వెంటనే వెక్రమార్కుడు, దేవుడి విగ్రహం వెనుక నుండి, దేవుడే మాట్లాడినట్టుగా “అమ్మాయీ! నీ కోరికకి ఇన్నాళ్ళూ ఉలకక పలకక ఉన్నానంటే దానికి కారణం ఏంటంటే ఆ సమయం రాకపోవడం. ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయ్యింది. కానీ నీకు వైకుంఠ ప్రవేశానికి అనుమతి లభించాలంటే, ముందుగా నువ్వు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మొదట నీ ఆస్తులన్నీ పేదలకి పంచి పెట్టి, తరవాత, గుండు గీయించుకో. ఎందుకంటే వైకుంఠానికి జుట్టుతో రాకూడదు. తరవాత, బురద గుంటలో స్నానం చేసి, పిమ్మట పక్కనే ఉన్న గుంటలో స్నానం చేసి కాషాయవస్త్రాలు ధరించి దేహమంతా మసిపూసుకో. అలా చేసావంటే పుష్పక విమానం నీ కోసం వస్తుంది. తరవాత నువ్వు వైకుంఠాలోని కొలనులో స్నానం చేసావంటే, నీ శరీరం అధ్బుతంగా మెరిసిపోతుంది. నీ జుట్టు 100 గజాల పొడవు పెరిగుతుంది. నీ లావణ్యానికి దేవతా స్త్రీలంతా దిగ్బ్రమ చెంది నీ చుట్టూ మూగుతారు” అని చెప్పాడు.

వెంటనే రత్నవల్లి “అలాగే స్వామీ! మీ మాట జవదాటు తానా? మీరు చెప్పినట్టే చేస్తాను” అని చెప్పి, రాజు వద్దకు వెళ్ళింది. “రాజేంద్ర! నాకు మన ఊరి పరాకు స్వామి బొందితో వైకుంఠం వెళ్ళే భాగ్యం ఇచ్చారు” అని చెప్పింది. రాజుతో పరాచకాలు ఆడేటంత ధైర్యం ఎవరికీ ఉండదు కాబట్టి, రత్నవల్లి చెప్పింది నిజమేనేమో, ఒక వేళ పూర్వ జన్మలో ఆమె ఎంతో పుణ్యం చేసుకునిందేమో అనుకుని ఆమెని ఎంతగానో పొగిడారు.

"మహారాజా! పుష్పక విమానంని చూసే అవకాశం మళ్ళీ దొరుకుతుందో లేదో! మిత్రదేశ రాజులకు వర్తమానం పంపించితే పుష్పక విమానంని చూస్తారు కదా అని నా ఉద్దేశం” అని రత్నవల్లి రాజుకి విన్నవించింది.

రాజు కూడా ‘రత్నవల్లి చెప్పింది నిజం ఐతే నా మిత్ర రాజులు కూడా ఆ గొప్ప దృశ్యం చూస్తారు. లేకపోతే తిరిగి వెళ్ళిపోతారు, అంతేకదా! కానీ ఈమె చెప్పింది నిజం గనక అయ్యి ఉండి, నేనేమో వాళ్ళను పిలవలేదంటే వాళ్ళు ఎంతగానో నొచ్చుకుంటారు. కనుక వాళ్ళకు వర్తమానం తప్పక పంపించాలి’ అని ఆలోచించి రాజు వర్తమానాలు పంపమని ఉత్తరువు జారీ చేసాడు.
మిగిలిన పనులన్నీ రత్నవల్లి దేవుడు చిప్పినట్టే చేస్తున్నాను అనుకుంటూ విక్రమార్కుడు చెప్పినట్టు చేసి గుడి దగ్గర ఎదురు చూడ సాగింది. ఆమెతో పాటూ రాజు, ఇతర దేశాల రాజులు వారి పరివారం, ఇంకా వీళ్ళ ఊరిలోని జనం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. దేశదేశాల నుండీ వచ్చిన వారిలో భట్టి కూడా ఉన్నాడు.

విక్రమార్కుడు వాళ్ళందర్ని గమనించి నవ్వుకుంటూ గరుడ స్తంభం మీద నిలుచుని “ఓ రత్నవల్లి! ఆ నాడు నన్ను చంపితింటానని గొప్పగా శపధం చేసావుగా! ఇప్పుడు చెప్పు నీవు చేసిన శపధం నెగ్గిందా లేక నేను నిన్ను అవమానించడం జరిగిందా? ఏం నీకు గుర్తులేదా అదే ఆ రోజు….” అంటూ విక్రమార్కుడు మొత్తం మణివేగుని అంగడి వద్ద జరిగిన దాని దగ్గరనుండి తను దేవుడి విగ్రహం వెనుక నుండి మాట్లాడడం నుండి అప్పటి వరకూ జరిగిన అన్నీ చెపుతూ రత్నవల్లిని ఎగతాళి చేశాడు.
అంతా కూడా రత్నవల్లిని చూసి ఒకటే నవ్వారు. ఆ అవమానం భరించలేక రత్నవల్లి ఎవరికీ కనబడకుండా ఎక్కడకో వెళ్ళిపోయింది. రాజులంతా కూడా తమతమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. భట్టి మాత్రం విక్రమార్కుడికే ఇంతటి తెలివి తేటలుంటాయి ఖచ్చితంగా ఆ చిలుకలో ఉంది విక్రమార్కుడే అని గ్రహించి, ఆయన దగ్గరకు వెళ్ళి “అన్నగారూ! మీరు ఉజ్జయినిని మరిచి ఇలాంటి చిద్విలాసాలతో కాలం వృధా చేయడం మంచి పద్దతేనా!” అంటూ చిరుకోపం చూపించి విక్రమార్కుడిని తనతో పాటూ తీసుకువెళ్ళిపోయాడు.

విక్రమార్కుడు జరిగిన విశేషాలన్నీ చెప్పాడు. భట్టి మంగలివాడు చేసిందంతా చెప్పాడు. ఇద్దరూ కలిసి మంగలివాడికి శాస్తి చేయడానికి ఒక చక్కని పధకం పన్నారు.

ఆ పధకం ప్రకారం రాణుల దగ్గరనుండి ఒక కబురు పంపించమని చెప్పారు. ఆ కబురు ఇలా ఉంది “మా దేవీ పూజ సమాప్తమైంది. మీరు రావచ్చు కానీ పొట్టేలు పందాలలో మీరు గెలవాల్సి ఉంటుంది.”

మంగలివాడు `సరే’ అని ఉత్సాహంగా పొట్టేలు పందాలు జరిగే చోటుకు వెళ్ళాడు. అక్కడ రెండు పొట్టేళ్ళున్నాయి “ఒకటి రాణుల పొట్టేలు, ఇంకోటి మీ పొట్టేలు. మీ పొట్టేలు గెలిస్తే మాత్రమే మీరు రాణుల అంతఃపురంలోకి ప్రవేశించ గలిగేది” అని భట్టి షరతు గురించి చెప్పాడు.

రాణులపోతు బక్కగా ఉన్నా కూడా యుక్తి కలిగింది అవటం వల్ల మంగలివాడి పొట్టేలుని చంపేసింది. కానీ మంగలివాడు ఆ పోతు చనిపోతే తను లోకోత్తర సౌందర్యవతులైన విక్రమార్కుడి భార్యలని చూడడం కుదరదేమోనన్న అనుమానంతో పరకాయప్రవేశ మంత్రం చదివి తన పొట్టేలులోకి ప్రవేశించాడు. అదే అదనుగా విక్రమార్కుడు తన శరీరంలోకి పరకాయప్రవేశ మంత్రం ద్వారా ప్రవేశించాడు.

వేంటనే భట్టి మంగలివాడు ప్రవేశించిన పొట్టేలుని చంపించేసాడు. దాంతో మంగలివాడు చనిపోయాడు. మంగలివాడి చరిత్ర సమాప్తమైంది. అలాగే మన కధ కూడా సమప్తమైంది.

6 కామెంట్‌లు:

aaa చెప్పారు...

హాయ్ గీతా..
ఇప్పుడు నీ బ్లాగు టెంప్లేట్ చాలా బావుంది.
నువ్వు చెప్పిన చిలుక కథ చాలా చాలా బాగుంది.
ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం ఎదురు చూస్తుంటాను :)

ఒక చిన్న సలహా.. నువ్వు రాసే కథలన్నీ.. ఒక్కో కథా ఒక లేబుల్ గా పెట్టావనుకో.. కొత్త వారెవరైనా వచ్చినా కూడా.. విడి విడిగా ఆయా కథలు చదువుకోగలిగే అవకాశం ఉంటుంది.

Aruna చెప్పారు...

very good.
Thank you for telling us a nice story.

కిరణ్ చెప్పారు...

meeru ilaage inkaa kathalu post chestea.. meeku thanks...

మనోహర్ చెనికల చెప్పారు...

good story
chinnappudu chandamaamalO chadive vikramarka kadhalu gurtochchaayi..

Chandamama చెప్పారు...

Aayushmaan bhava!!

Aha!Oho! చెప్పారు...

అందరికీ ధన్యవాదాలు!