22, నవంబర్ 2008, శనివారం

నన్ను ప్రోత్సహించండి

ముందుగా నా గురించి కొంచెం చెప్తానండి! మరేమో నేనేమన్నా చిన్నదాన్నా చితకదాన్నా! బోల్డుచాలా పెద్దదాన్ని కదా! మరే అందుకే బాపు బొమ్మలని చూసి నేను కాపి కొట్టేశానండి. మరే ఇవన్ని నేనే వేసానండి. అవన్ని మీరు చూశారుకదా మరి నన్ను ప్రోత్సాహించండి, మరి పాపం నేను చిన్నదాన్ని చితకదాన్ని కాకపోయినా బోల్డుకుంచెం చిన్నదాన్ని కదా, అందుకని.

21, నవంబర్ 2008, శుక్రవారం

అడవిలో అందాల మయూరి

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల

నకిలీ బాపు

14, నవంబర్ 2008, శుక్రవారం

నేనూ నా ప్రకృతి

ముందుగా మీ అందరికీ నేను రాసిన కవిత ఒకటి చెప్పాలనుకుంటున్నానండి.

ఒక అందమైన అమ్మాయి కొండల్లో కోనల్లో తిరుగుతుంది. ఆమెకొక చక్కని దృశ్యం కనిపించింది. రెండు గుట్టలు అవి పచ్చరంగు చీరకట్టినంత ముద్దుగా, అందంగా ఉన్నాయి. ఎన్నో రంగుల పూలు, సుగంధ భరిత పరిమళాలు, హొయలొలికే లతలు, పచ్చని గడ్డి, ఎంతో అందంగా ఉన్న ఆ రెండింటి మద్య ఒక అందంమైన ఏరు. ఏటిలో చేపలు. ఏటి గట్టున ఊరు. ఆ ఊరె మా ఊరు. ఆ అమ్మాయే నేను.

స్వాగతం! మంచి స్వాగతం!

ఆహా! ఓహో! నమస్కారమండి! నేనూ బ్లాగులోకంలో చేరాను, ఒక బ్లాగు ప్రారంబించాను. నా బ్లాగుకు నేనే కర్త, కర్మ, క్రియ అనుకుని నాకు నచ్చిన కధలు, నేను రాసిన కవితలు ఎవరు చదివినా, ఎవరు చదవకపోయినా రాసేద్దాం అనుకుంటున్నాను. నా భావాలు, నా అనుభవాలు అన్నీ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను.