1, జనవరి 2009, గురువారం

మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం

ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకెంతగానో ఇష్టమైన ఈ జోకుని మీరంతా కూడా చదివి నవ్వుకుంటారు అని రాస్తున్నాను. నిజానికీ ఒక వార్తా పత్రికలో వచ్చిన జోకుని నేను ఎత్తి రాస్తున్నను (అబద్దం చెప్పాను, టైపు చేస్తున్నాను.)


పెగ్-1:
మందు విషయంలో మాత్రం మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, మా ఆవిడ వంట చేస్తూంటుంది.
వంటింట్లోంచి వంటపాత్రల శబ్దం వినిపిస్తూంటుంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరుతాం.
చెక్క బీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే..... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటకమీంచి గ్లాసందుకుంటాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
గ్లాసు కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
అఫ్ కోర్స్, బాటిల్ కూడా చెక్కబీరువాలో పెట్టేస్తాం.
తాతగారు బోసినవ్వుతో చూస్తారు.
వంటిట్లోకి తొంగిచూస్తాను.
మా ఆవిడ చపాతీ పిండి కలుపుతూంటుంది.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం
ఎందుకంటే..... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: శర్మగారమ్మాయి పెళ్ళి సంగతేమైంది?
ఆవిడ: తిన్నగా ఉంటే కదా మంచి సంబంధాలు రావడానికి?

పెగ్-2:
మనం మళ్ళీ ఇవతలికి వస్తాం.
చెక్కబీరువా తలుపు చప్పుడు చెస్తుంది.
మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్ తీస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
బాటిల్ కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే..... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఏమిటోయ్, మన శర్మ కూతురు అప్పుడే పెళ్ళీడుకొచ్చేసిందా?
ఆవిడ: ఇంకా పెళ్ళి వయసేమిటి? అడ్డగాడిదలా ముప్ఫైయేళ్ళొస్తుంటే.
నేను: ఓ... ఐసీ!

పెగ్-3:
మనం మళ్ళా చెక్కబీరువాలోంచి చపాతీ పిండి తీస్తాం.
చెక్కబీరువాలో బాత్రూం ప్రత్యక్షం అవుతుంది.
బాటిల్ తీసి అటకలో రెండౌన్సులు పోస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి ముడుచుకుంటాం.
తాతగారు పడీపడీ నవ్వుతుంటాడు.
అటకని పిండిమీద పెట్టేసి
తాతయ్యని కడిగేసి చెక్కబీరువాలో పెట్టేస్తాం.
వంటింట్లోకి తొంగిచూస్తాం.
మా ఆవిడ పొయ్యిమీద బాత్రూం పెడుతుంది.
ఈ బాటిల్లో సద్దు ఆ బాటిల్లో పడనివ్వం.
ఎందుకంటే..... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఏంటే మా శర్మగార్ని గాడిదంటావా, తోలు ఒలిచేస్తాను.
ఆవిడ: ఊరికే గొడవ చెయ్యకుండా వెళ్ళి పడుకోండి.

పెగ్-4:
మనం పిండిలోంచి బాటిల్ తీస్తాం.
చెక్కబీరువాలోంచి ఓ పెగ్గు కలుపుతాం.
బాత్రూం కడిగేసి అటక మీద పెట్టేస్తాం.
మా ఆవిడ ఫొటోలోంచి నవ్వుతూ చూస్తుంటే గాంధీ వంటచేస్తుంటాడు.
ఈ శర్మ సంగతి ఆ శర్మగాడికి తెలియనివ్వం.
ఎందుకంటే..... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఇంతకీ శర్మగాడి పెళ్ళి ఆ గాడిదతో అయిందా లేదా?
ఆవిడ: నెత్తిమీద బక్కెట్ నీళ్ళు పోశానంటే... వెళ్ళండి బయటికి.

పెగ్-5:
నేను మళ్ళీ కిచెన్ లోకి వెళ్తాను.
నిశ్శబ్దంగా అటకమీద కూర్చుంటాను.
డ్రాయింగ్ రూంలోంచి బాటిళ్ళ శబ్దం వినిపిస్తుంటుంది.
నేను లోపలికి తొంగిచూస్తే మా ఆవిడ బాత్రూంలో మందేస్తుంటుంది.
వెంటనే లటక్కున మూతేసి చటుక్కున పెగ్గు తుడుచుకుంటాం.
ఈ గాడిద చప్పుడు ఆ గాడిద చెవిలో పడనివ్వం.
అఫ్కోర్స్, తాతయ్య ఎప్పుడూ రిస్క్ తీసుకోడు.
శర్మ వంట చెయ్యడం పూర్తయ్యేవరకూ
మనం ఫోటోలో కూర్చుని మా ఆవిణ్ణి చూసి నవ్వుతుంటాం.
ఎందుకంటే..... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.

9 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

పెగ్గు పెగ్గుకీ ఎంత వైవిధ్యం. ఒరిజినల్ గా ఆ పత్రికలో రాసిన రచయితకు అభినందనలు. ఏ పత్రికో కూడా రాస్తే బాగుండేది. మీకూ అభినందనలు.

రాజ్ కుమార్ చెప్పారు...

Idi already evari blog lono chadivi nattu gurthu....
But i enjoyed it.... KEep it up...

Happy NEw year..

అజ్ఞాత చెప్పారు...

Sooper ga undandi.... i enjoyed it.
kani deenni evari blog lono chadivi nattu gurthu....

Happy New year...

సుధాకర బాబు చెప్పారు...

శ్రీధర్ గారూ! ఇది మన బ్లాగరి మధుబాబు సృష్టి అనుకొంటాను.

http://madhubaabu.blogspot.com/2008/04/blog-post_30.html

అజ్ఞాత చెప్పారు...

నాయనలారా ఇది ఈనాడు ఆదివారపు సంచిక లో వచ్చినది. దీనిని ఎంతో మంది బ్లాగరులు తమబ్లాగులలో గతములో వేసియుండిరి, మరొక్కసారి ఇక్కడ వచ్చియుండినది. అందరినీ అలరించినది.

kiraN చెప్పారు...

ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
దీనిని నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో చదివి ఎంతో నచ్చి అదే రోజు నా బ్లాగులో పోస్ట్ చేసాను.
బహుశా దీన్ని ముందుగా నేనే పోస్ట్ చేసి ఉంటాను.
రచయిత పేరు గుర్తులేదు కానీ మూలం మాత్రం ఒక బెంగాల్ రచయిత నుంచి అని మాత్రం తెలుసు.


- కిరణ్
ఐతే OK

kiraN చెప్పారు...

ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
దీనిని నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో చదివి ఎంతో నచ్చి అదే రోజు నా బ్లాగులో పోస్ట్ చేసాను.
బహుశా దీన్ని ముందుగా నేనే పోస్ట్ చేసి ఉంటాను.
రచయిత పేరు గుర్తులేదు కానీ మూలం మాత్రం ఒక బెంగాల్ రచయిత నుంచి అని మాత్రం తెలుసు.


- కిరణ్
ఐతే OK

Bolloju Baba చెప్పారు...

ఈనాడు లో 27.జూలై.2008 న అచ్చయిన ఈ కవిత కు మూలం ఒక మరాఠీ కవిత.
దానికి తెలుగు సేత హరీషుజీ. ఈ కవితను చదివిన స్ఫూర్తితో ప్రముఖ కవయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారు ఇదే కవితను స్త్రీవాద కోణంలో వ్రాసారు. అది ఈ కవితా వస్తువు యొక్క మరో కోణాన్ని చక్కగా ఆవిష్కరించింది. దాన్ని ఈ క్రింది లింకులో చూడవచ్చును.

http://nirmalak.blogspot.com/2008/10/blog-post.html

అజ్ఞాత చెప్పారు...

నేను నవ్వుకున్నా....