4, మార్చి 2009, బుధవారం
నా గీతల్లో వివేకానందుడు [బొమ్మ]
వివేకానందుడి `ఫోటో’ చూసి నేను వేసిన ఈ బొమ్మ నా తొలి ప్రయత్నం. వివేకానందుడి జీవిత చరిత్ర చదివినప్పటి నుండి ఆయన బొమ్మ వేయాలని కలలు కనేదాన్ని కానీ, ధైర్యం మాత్రం చాలేది కాదు. తీరా నేను బొమ్మ వేశాక ఎవరైనా ఆ బొమ్మని చూసి "ఏంటి ఈ బొమ్మ? ఎవరి బొమ్మా నువ్వు వేసింది?" అని అడగాల్సి వస్తుందేమోనని పెద్ద అనుమానం. అప్పుడు నాకు నేను ‘అయ్యవారిని చెయ్యబోతె కోతి అయ్యింది’ అన్న సామెత చెప్పుకోవాల్సి వస్తుంది కదా!
కానీ ఇన్నాళ్ళకి నా కలలు సాకారం అయ్యాయి!
నేనూ మార్గదర్శిలో చేరాను. ఒక బొమ్మ వేశాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 కామెంట్లు:
మంచి ప్రయత్నం. ఇలాగే ప్రయత్నిస్తూ ఉండు... ఇంకా బాగా వేయగలుగుతావ్.
అప్పుడే వివేకానందుని జీవిత చరిత్ర కూడా చదివేసావన్నమాట. Very good! :)
ఎవరి బొమ్మా నువ్వు వేసింది? :P
మంచి ప్రయత్నం
నాకో అనుమానం బొమ్మలెయ్యాలంటే కూడా మార్గదర్శిలో చేరాల్సిందేనా.
మొదటిసారి చూసాను బ్లాగును. కథలు చేర్చి, బొమ్మలుగీసి బ్లాగర్లదృష్టికి చూపించే ప్రయత్నపూర్వక హుషారు నచ్చింది. good మార్కు ఇచ్చేసాను :D.
ముందుగా వ్యాక్య వ్రాసినందుకు అందరికీ ధన్యవాదాలు.
రాణక్కా ,
ఇంత వివరంగా వేసినా అర్ధం కాలేదా అక్కా! :-)
శాక్యముని తాతా ,
అవును తాతా [మరి మీ వయసు 106 అని వ్రాసారుగా! :-)] వివేకానందుడి జీవిత చరిత్ర ఎప్పుడో రెండేళ్ళ క్రితమే చదివాను. మొన్ననే ‘సత్య శోధన’ బాపూజీ ఆత్మకధ కూడా చదివాను. నిజానికీ ఆ పుస్తకం చదవడంలో పడి ఇన్నిరోజులూ టపాలు వ్రాయలేదు.
మోహన్ uncle,
మరి ఏదో ఒక దాంట్లో చేరాలి కదా! లేకపోతే వాళ్ళు బాధపడరూ? :-) మీరు వేసే బొమ్మలంటే నాకు చాలా ఇష్టం uncle. చాలా బాగుంటాయి.
బావుంది, ఇంకాస్త పెద్ద బొమ్మలు కూడా ప్రయత్మించు బుజ్జితల్లి. అవే వస్తాయి.
:)మార్గదర్శి ఏంటో అర్థం కాలేదు :(
మిగతాదంతా బానే ఉంది. Keep it up.
జ్యోతి ఆంటీ : మీ ప్రోత్సహానికి ధన్యవాదాలు!
నారాయణ ఆంకుల్: ఇలాంటి పెద్దపెద్ద ప్రశ్నలకు నాలాంటి చిన్నచిన్నపిల్లలు సమాధానం చెప్పటం కష్టం. అర్ధం చేసుకోవాలి, అంతే! మీ ప్రోత్సహానికి ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి