9, ఫిబ్రవరి 2009, సోమవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 12

(నిన్నటి కధ తరువాయి భాగం)

పయ్యెద “ఓ రాజేంద్రా! ఇప్పుడు చెప్పండి నలుగురు దొంగలలో ఎవరి సామర్ధ్యం ఎక్కువ?” అని అడిగాడు.

"ఓ పయ్యెదా! రాజూ, మంత్రీ, కొత్వాల్, బట్టల వ్యాపారీ వీళ్ళకే ఎక్కువ సామర్ధ్యం ఉంది” అని చెప్పాడు విక్రమార్కుడు.

అప్పుడు పలుకని పడంతి “ఏమయ్యా నువ్వసలు కధ విన్నావా? లేక నిద్ర పోయావా? అసలు కధ అర్ధమైందా? నలుగురు దొంగలే ఎక్కువ సామర్ధ్యం ఉన్నవాళ్ళు” అని చెప్పింది.

విక్రమార్కుడు “ఔనౌను. నువ్వు చెప్పింది పచ్చి నిజం. అయినా ఇప్పుడు అందంతా ఎందుకు కానీ ఒక్కసారన్న నాతో మాట్లాడవచ్చు కదా?" అని బ్రతిమాలాడు.

అప్పుడు పయ్యెద “ఓ రాజవర్యా! మీరెందుకు ఇంకా ఆమెని బ్రతిమాలుతున్నారు? మీరు కావాలని కధలకి జవాబులు తప్పుగా చెప్పగానే, ఈ పలుకని పడంతి ముందూ వెనుకా ఆలోచించకుండా మాట్లాడేసింది. ఇప్పటికి ఆమె మూడు సార్లు మాట్లాడేసింది. కాబట్టి మీరు గెలిచినట్టే” అని అన్నాడు పయ్యెదలోని భేతాళుడు.

ఆప్పుడు అర్ధమైంది అక్కడున్న వాళ్ళందరికీ తము చేసిన పొరపాటు.

"పలుకని పడంతీ! నీకు నన్ను వివాహం చేసుకోవడం ఇష్టమేనా? నీకు ఇష్టం లేకపోతే నాకే అభ్యంతరం లేదు!” అని అన్నాడు విక్రమార్కుడు. `అంత తెలివైన వాడినీ, తనను ఓడించి ధర్మంగా గెలుచుకుని కూడా తనకి కూడా ఒక మనసు ఉంటుందనీ అర్ధం చేసుకునే అలాంటి మనిషిని ఎలా వదులుకోవడం? అసలు అలాంటి వాడికంటే తనకు కావలిసినది ఇంకెవరు?’ అని యోచించి పలుకని పడంతి విక్రమార్కుడితో వివాహానికి ఒప్పుకుంది. ఇద్దరికీ కూడా వేదవిధులతో వైభవోపేతంగా వివాహం జరిగింది.

ఆ తరవాత భట్టీ, విక్రమార్కుడూ, పలుకని పడంతీ, కొంత మంది పనివాళ్ళతో బయలుదేరారు.

అయితే ఊరు దాటాక విక్రమార్కుడు పలుకని పడంతినీ, భట్టినీ “ఈ పనివాళ్ళతో సహా మీరు ఊరి అడవిలోని ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. నాకు కొంచెం పనుంది. మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి నెను వస్తాను” అని చెప్పి విక్రమార్కుడు ఎక్కడికో వెళ్ళాడు.

విక్రమార్కుడు చెప్పినట్టుగానే వీళ్ళు బయలుదేరారు. అయితే విక్రమార్కుడు భేతాళుడి సాయంతో ఒక ముస్సలి వాడి వేషం వేసుకుని ఒక కట్టెలమోపుని మోసుకుంటూ పలుకని పడంతి ఎక్కిన పల్లకీ పక్కనుంచీ నడుచుంకుటూ వెళ్ళాడు.

అంత ముస్సలివాడు అలా మండుటెండలో కట్టెలు నెత్తిన పెట్టుకుని వెళ్ళడం చూసి తట్టుకోలేక పలుకని పడంతి “ఓ స్వామీ! ఎందుకంత కష్టపడీ ఆ కట్టెల మోపుని మీరు తీసుకెళ్ళడం. మా భటులకి ఇవ్వండి వాళ్ళు తెచ్చిపెడతారు” అని చెప్పింది.

"లేదు లేదు! ఇది అసలు కట్టేల మోపు కాదు. ఇవి సమిధులు [యఙ్ఞం కోసం వినియోగించే కట్టెలు] వీటిని బ్రాహ్మణులు లేదా క్షత్రియులు మాత్రమే మోసుకెళ్ళాలి. అన్యులు తాకకూడదు” అని చెప్పాడు వృధ్ధుడి రూపంలోని విక్రమార్కుడు.

పలుకని పడంతి క్షత్రియ కన్య కనుక “సరే ఐతే నాకివ్వండి.నేను క్షత్రియురాలిని” అని చెప్పింది పలుకని పడంతి. విక్రమార్కుడు ఆమె చేతికి ఆ సమిధులు ఇచ్చాడు.

ఆమె ఆ సమిధులని నెత్తిమీద పెట్టుకుని మర్రి చెట్టు కొమ్మదాకా నడిచివాచ్చింది.

విక్రమార్కుడు తను వేసిన పందెంలో గెలిచాడు.

(సమాప్తం)

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

హమ్మయ్య మొత్తానికి కథ కంచికి చేరింది. ధన్యవాదాలు.

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

చాలా మంచి కథను అందించారు.

జీడిపప్పు చెప్పారు...

మంచి కథ అందించారు.
ఒక సూచన: మీరు లేబుళ్ళను కాస్త మారిస్తే మరింత సులభంగా ఉంటుంది సంబంధిత పోస్టులు చదవడానికి. ఇపుడు ఈ పోస్టుకు పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 12 అని లేబుల్ పెట్టారు. దాన్ని క్లిక్ చేస్తే కేవలం ఈ ఒక్క పోస్టు మాత్రమే కనిపిస్తుంది. అలా కాక ఈ పోస్టుకు పలు లేబుళ్ళు తగిలించండి. నేనయితే ఇలా చేస్తాను
కథలన్నిటికీ - కథలు
విక్రమార్కుని కథలన్నిటికీ - విక్రమార్క కథలు
పలుకని పడంతి కథ అన్ని భాగాలకు - పలుకని పడంతి అని లేబుళ్ళు ఇస్తాను. అంటే ప్రస్తుతం ఈ పోస్టుకు మూడు లేబుళ్ళు ఇస్తాను "కథలు, విక్రమార్కుని కథలు, పలుకని పడంతి" అని.
ఎవరయినా పలుకని పడంతి పైన క్లిక్ చేస్తే ఆ కథకు సంబంధించిన అన్ని భాగాలూ వస్తాయి. "విక్రమార్క కథలు" పైన క్లిక్ చేస్తే అన్ని విక్రమార్కుని కథలు వస్తాయి.

శశాంక చెప్పారు...

మొత్తానికి శుభం కార్డేసారు :)

నేస్తం చెప్పారు...

చాలా మంచి కథను అందించారు...thanks :)

మనోహర్ చెనికల చెప్పారు...

chaalaa pedda kadha raasaavu,,,